‘ఆర్ ఎక్స్ 100’ ఒక్క సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకున్న రాజ్ పుత్ . కుర్రకారుకు మరింత హీట్ పుట్టించే ఐటమ్ సాంగ్ తో రచ్చ చేస్తుంది. అందాల ఆరబోత వేస్తూ చేసిన ఈ పాట యూత్ స్టెప్స్ వేసేలా ఉంది. తేజ దర్శకత్వం వహించిన సినిమా ‘సీత’. సినిమాలో బెల్లంకొండ హీరో గాను, కాజల్ హీరోయిన్ గాను నటిస్తుంది. అయితే ఈ సినిమంతా సీత చుట్టూనే తిరుగుతుందట. విభిన్నమైన కథాకథనాలతో సాగే సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా సినిమా నుంచి ఒక ఐటెం లిరికల్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్ వారు. హాట్ హాట్ స్టెప్స్ , ఎక్స్ప్రెషన్స్ తో పాయల్ ఊపు ఊపేసింది.
“బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్ దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి.. యమహా ఏసుకొచ్చే యాదిరెడ్డి.. బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి ..” అని కొనసాగే పాటలో మంచి మసాల తగిలించి… మస్తుగా వదిలారు. తెరపైన ఈ సాంగ్ దుమ్ము రాపేయడం ఖాయమన్నట్లు కనిపిస్తుంది. ఎంతో జోరుగా, హుషారుగా దూసుకెళ్తున్న పాటకు.. పాయల్ చిందులు అదిరాయని చెప్పక తప్పదు. రాజ్‌పుత్ చేసిన డాన్స్ యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఉంది కాజల్, బెల్లం కొండకు ఎలాంటి హిట్ ఇవ్వబోతుందో సీత చూడాలి. ఈ చిత్రంలో సోనూసూద్,తనికెళ్ల భరణి,అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న చిత్రం ఈ నెల 25 తేదీన రిలీజ్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది.