
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా ఎక్కువ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటికే కాంచన సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న లారెన్స్, అటు నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మీ బాంబ్’ అనే సినిమాను తెరకెక్కిస్తు్న్న లారెన్స్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.175 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. లారెన్స్ డైరెక్ట్ చేసి నటించిన లాస్ట్ మూవీ కాంచన 3 కూడా అన్ని భాషల్లో కలిపి రూ.115 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా వరుసగా వంద కోట్ల చిత్రాలను డైరెక్ట్ చేసిన లారెన్స్‌కు నిజంగా అంత సత్తా ఉందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం అవునని పక్కాగా రావడం లేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘రంగస్థలం’ చిత్ర తమిళ రీమేక్‌లో లారెన్స్ నటిస్తున్నాడు. అయితే ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తూ కనిపించే లారెన్స్ ఇలాంటి సినిమాలో నటించడం ఏమాత్రం మంచిది కాదని పలువురు క్రిటిక్స్ అంటున్నారు.
హీరో సెలెక్షన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్గా నిక్కీ గిల్రానీ ఎంపిక కూడా ఏమాత్రం పర్ఫెక్ట్ కాదని పలువురు అంటున్నారు. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచిన ‘రంగస్థలం’ను ఈ వంద కోట్ల డైరెక్టర్, సారీ యాక్టర్ ఏం చేస్తాడో అనే ఆందోళన మెగా ఫ్యాన్స్‌లో నెలకొంది. ఏదేమైనా రాఘవ లారెన్స్ దెబ్బకు తెలుగు, తమిళ, బాలీవుడ్ జనాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారనేది వాస్తవం.