Home సినిమా బాలీవుడ్ న్యూస్ బాలీవుడ్‌లో బలాత్కారాలు ఎక్కువ అంటోన్న బాలయ్య బ్యూటీ

బాలీవుడ్‌లో బలాత్కారాలు ఎక్కువ అంటోన్న బాలయ్య బ్యూటీ

Radhika Apte About Bollywood

సినిమా రంగంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని చాలా మంది ఎన్నో ఆశలతో వస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ రంగాల్లో తమ ప్రతిభ చాటుకుని హీరోయిన్‌గా మారి కెరీర్‌ను సెట్ చేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. కానీ వారందరినీ భయబ్రాంతులకు గురిచేసే అంశంగా క్యాస్టింగ్ కౌచ్ మారింది. సినిమాల్లో ఛాన్సులు కావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందే అనే ఆనవాయితీ ఇండస్ట్రీలో కొంతమంది నడిపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను అణచివేసేందుకు చాలా మంది నడుం కట్టారు.

అయితే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారు సైతం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని తాజాగా చెబుతున్నారు. బాలీవుడ్‌లో బోల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించే అందాల భామ రాధికా ఆప్టే తనకు హీరోయిన్ కావాలనే తన ఆశకు చాలా మంది అడ్డు పడ్డారని చెబుతోంది. తాను సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు తన చుట్టూ ఉండేవారు ససేమిరా అన్నారని, బాలీవుడ్‌లో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతాయని ఆమెను నివారించారని ఆమె పేర్కొంది. హీరోయిన్‌గా రావాలనే చాలా మంది అమ్మాయిలకు కూడా ఇలాంటి పరిస్థితి ఇంకా ఎదురవుతుందంటే, ఇండస్ట్రీలో ఎలాంటి వాతావరణం ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆమె అంటోంది.

మొత్తానికి సినిమా రంగానికి చెందిన చీకటి వైపును ప్రేక్షకుల్లో తొలగిస్తేనే వారికి ఇండస్ట్రీపై ఉన్న చెడు భావన పోతుందని ఆమె అంటోంది. ఇక బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలనుకునే వారు నిస్సందేహంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని రాధికా ఆప్టే అంటోంది. అటు సినిమాల పరంగా చాలా సెలెక్టివ్‌గా బోల్డ్ కంటెంట్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పి్స్తోంది ఈ బ్యూటీ.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad