Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఆ విషయంలో రాధేశ్యామ్ సైలెన్స్ ఎప్పుడు వీడుతాడో?

ఆ విషయంలో రాధేశ్యామ్ సైలెన్స్ ఎప్పుడు వీడుతాడో?

Radhe Shyam Suspense Continues

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం కోసం ప్రేక్షకలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఈ సినిమా నిర్మాతలను ఏసుకున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి పడింది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ పీరియాడికల్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా పోస్టర్లపై చిత్ర యూనిట్‌కు సంబంధించి అందరి పేర్లు ఉన్నా, ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారా అనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. ఈ పోస్టర్స్‌లో ఎక్కడా కూడా మ్యూజిక్ డైరెక్టర్ పేరును చిత్ర యూనిట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటారా లేక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరి రాధేశ్యామ్ చిత్రానికి సంగీతం అందించేది ఎవరో తెలియాలంటే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కి్స్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad