Home సినిమా టాలీవుడ్ న్యూస్ రాధేశ్యామ్‌కు తగ్గిన క్రేజ్.. ఎందుకో తెలుసా?

రాధేశ్యామ్‌కు తగ్గిన క్రేజ్.. ఎందుకో తెలుసా?

Radhe Shyam Craze Gone Down

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే చాలా రోజుల తరువాత ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి పడింది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా ఈ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతూ ఉంటుందని భావించిన చిత్ర యూనిట్‌కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ భారీ ఎత్తున బడ్జెట్‌ను కేటాయించిందట. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం సినిమాలు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో ‘రాధేశ్యామ్’పై భారీగా ఇన్వె్స్ట్ చేసినవారు తలలు పట్టుకుంటున్నారట.

ఇప్పట్లో ఈ పరిస్థితులు చక్కబడే సూచన కూడా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లో భారీ రేటుకు ఎవరు కొంటారో అర్ధం కానీ పరిస్థితి. మరి కరోనా నిజంగానే రాధేశ్యామ్ కొంప ముంచుతుందా, లేక ఇదంతా కేవలం గాలివార్తగానే మిగులుతుందా అనేది తెలియాలంటే మాత్రం సినిమా బిజినెస్ జరిగే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే నటిస్తోండగా, ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad