Home టాప్ స్టోరీస్ సుకుమార్ ను చిక్కుల్లో పడేసిన మిర్స్లవ్ బ్రోజేక్

సుకుమార్ ను చిక్కుల్లో పడేసిన మిర్స్లవ్ బ్రోజేక్

Allu Arjun Trend Fan made poster of Pushpa

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన చిత్రాలలో సుకుమార్ పుష్ప మూవీ ఒకటి. ఈ  సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ అంతుపట్టని విషయంగా మారిపోయింది. తాజాగా కేంద్రం మూవీ షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాని కేరళలోని అడవుల్లో తెరకెక్కించారు. అయితే అక్కడ కరోనా కేసులు అధికంగా ఉండటంతో పాటు కరోనా విజృంభణ మొదలైంది కూడా ఆ ప్రాంతం కావడంతో అక్కడి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. చివరికి మూవీ టీం షూటింగ్ ను మారేడుమిల్లి అడవులకు షిప్ట్ చేసి షూటింగ్ పూర్తి చేద్దాం అనుకున్నారు. అయితే ఇంతలో కేంద్రం కరోనా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ప్రస్తుతం కేంద్రం షూటింగ్ కు అనుమతి ఇవ్వడంతో పాటు, ఎటువంటి పరిమితులను విధించి లేదు. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బన్నీ మరియు సుకుమార్ షూటింగ్ సిద్ధంగా ఉన్నప్పటికీ  పరిస్థితులు మాత్రం కలిసి రావటం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ మూవీ కెమెరామెన్ మిర్స్లవ్ బ్రోజేక్. పుష్ప సినిమా సినిమాటోగ్రఫీ పోలాండ్ దేశానికి చెందినవాడు. లాక్ డౌన్ కు ముందు ఆయన పోలాండ్ కు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. ఇప్పుడు అయన రావాలంటే ఆ దేశం అనుమతి తప్పనిసరి.

కేంద్రం అంతర్జాతీయ విమాన ప్రయాణాల పై నిషేధం విధించడంతో బ్రోజేక్ భారత్ కు వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్టే. అందువల్ల పుష్ప సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందో ఎవరికీ అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత బన్నీ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad