Home సినిమా టాలీవుడ్ న్యూస్ మరో పోకిరి చేస్తానంటోన్న పూరీ

మరో పోకిరి చేస్తానంటోన్న పూరీ

Puri Jagannadh Wants To Make Pokiri 2 With Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం ఎలాంటి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన విధానం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా మహేష్ కెరీర్‌ను అమాంతం మలుపుతిప్పేసిన చిత్రంగా నిలిచిందనడంలో ఎలాంటి సంకోచం లేదు. ఈ సినిమా సాధించిన విజయంతో ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైనప్పుడు గుర్తుకు చేసుకుంటారు జనాలు.

అయితే ఆ తరువాత మహేష్ బాబుతో కలిసి పూరీ ‘బిజినెస్‌మెన్’ అనే మరో సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఆ తరువాత మళ్లీ ఈ కాంబో ఇప్పటివరకు కుదరలేదు. గతంలో ‘జనగణమన’ అనే టైటిల్‌తో మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్లు పూరీ ప్రకటించినా, అది కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. దీంతో మళ్లీ ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందా, మహేష్‌కు మళ్లీ ఓ పోకిరి ఎప్పుడు పడుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా మహేష్‌తో తాను ఎప్పటికైనా మరో సినిమా చేయడం ఖాయమని, అది ఖచ్చితంగా ‘పోకిరి 2’గా ఉంటుందని పూరీ జగన్నాథ్ అంటున్నాడు. వేరే సినిమాలకు కమిట్ అవ్వడం వలనే మహేష్ పూరీకి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాడని, త్వరలోనే పూరీతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని మహేష్ కూడా ఆశిస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ సెట్ చేసిన రికార్డులను మరోసారి అదే కాంబోలో వచ్చే సినిమా బద్దలు కొట్టాలని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad