‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు పూజా. ఆ తర్వాత నాజుకైనా సొగసుతో ‘ముకుంద’లో మెగా హీరో పక్కన నటించింది. ఇక్కడ ప్లాప్ కావడంతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లోకి ‘మొహంజొదారో’ లో నటించి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఎంతో భారీ బడ్జెట్ తో చిత్రం నిర్మితము కాగా అక్కడ నిరాశే మిగిలింది. ఈ సినిమా పరాజయాన్ని చవిచూసిన వెంటనే, ఆమెకు అవకాశలు కూడా దక్కలేదు. ఇక చేసేది ఏమి లేక.. టాలీవుడ్ లోకి వెనుతిరిగి వచ్చి స్టైలిష్ స్టార్ అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ లో గ్లామర్ రోల్ పోషించి తానేంటో చూపించుకుంది.
ఆ తర్వాత సొగసైన చిన్నది జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమెతలో నటించింది. ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన వరుసగా అవకాశాలను అందుకుంది. తెలుగులో సత్తా చాటుతున్న ఈ అమ్మడు జోరు చూసి.. బాలీవుడ్ లో తిరిగి అవకాశాన్ని అందుకుంది. ‘హౌస్ ఫుల్ 4’లో అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాలో ఈ భామకు ఆహ్వానం వచ్చింది. ఈ చిత్రానికి నిర్మాత గా చేస్తున్న సాజిద్ నడయాడ్ వాలాకు పూజా నటన ఎంతో నచ్చిందట. ఇక తన పతాకం పై విడుదలయ్యే మరో రెండు చిత్రాల్లో కూడా నటించాలని సాజిద్ అడగగా , పూజ అగ్రిమెంట్ కి ఓకే అనిందని సమాచారం. ఇక ఈ సంగతి కనకే నిజమైతే బాలీవుడ్ లో భామ బాగా బిజీ అన్నమాటే.