Home సినిమా 'ప్రేమ కథా చిత్రం 2'.. మూవీ రివ్యూ

‘ప్రేమ కథా చిత్రం 2’.. మూవీ రివ్యూ

నటీనటులు: నందిత శ్వేతా, సుమంత్ అశ్విన్, సిద్ది ఇధ్నాని, ప్రభాస్ శ్రీను,  విధ్యులేఖ రమన్, కృష్ణ తేజు, ఎన్టీవీ సాయి

2013 లో ధర్మరాజ్రెడ్డి దర్శకత్వంలో తెలుగు హర్రర్ కామెడి సినిమాగా తెలుగు ప్రేక్షుకులను అలరించిన ‘ప్రేమకథా చిత్రం’ భారీ హిట్ అందుకుంది. దానికి సీక్వెల్ హర్రర్ సినిమాగా ‘ప్రేమకథా చిత్రం 2’ రూపుదిద్దుకుంది. హరికిషన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సుమంత్ అశ్విన్ , నందిత శ్వేతా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , టీజర్ లకు మంచి స్పందన లభించింది. నందిత శ్వేతా ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ అంటూ దయ్యం పట్టిన అమ్మాయిగా ఎంతో అద్భుతంగా నటించింది. నందిత ఈ సినిమాలో ఎంత వరకు భయపెట్టిందో.. మొదటి సినిమాకన్నా ఈ సినిమా లో కామెడీ ఎంతవరకు నటీనటులు పండించారో చూడాలనుంటే నాతో పాటు రండి చూద్దాం..

కథలోకి వెళ్తే .. సుమంత్ అశ్విన్ సుదీర్ పాత్రలో , నందిత శ్వేతా నందు పాత్రలో , సిద్ది ఇధ్నాని బిందు పాత్రలో పోషించారు. వీరితో పాటు ప్రభాస్ శ్రీను, విధ్యులేఖ రమన్ , కృష్ణ తేజు, ఎన్టీవీ సాయి కీలక పాత్రలు పోషించారు. సుదీర్ , బిందు ఓకే కాలేజ్ లో చదువుకుంటుంటారు. సుదీర్ ను వన్ సైడ్ లవ్ చేస్తుంది బిందు. ఏవో కొన్ని సంఘటనల కారణంగా వీరంతా కలిసి ఒక ఫామ్ హౌస్ కి వెళ్తారు. అప్పుడు నందిత శ్వేతా తెరకు పరిచయమవుతుంది. అక్కడ అంతు చిక్కని రీతిలో దయ్యం ఉంటుంది. హారర్ కామెడీతో సినిమా కొనసాగుతుంది.

ఫ్ల్యాష్ బ్యాక్ ల సన్నీవేశాలతో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ లను మాత్రమే వెంటాడుతుంటుంది దయ్యం. నందిత శరీరంలోకి ఆత్మ ప్రవేశించి ఫామ్ హౌస్ లో హీరో, హీరో ఫ్రెండ్స్ తో ఒక ఆటాడుకుంటుంది. అంతే ఇక ఆ దయ్యం తో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. దయ్యం కాస్త వీరందరికి ముచ్చెమటలు పట్టేలా చేస్తుంటుంది. కామెడీ పరంగా కడుపుబ్బనవ్వుకోవచ్చు.

అసలు ఆ దయ్యం ఎవరు? ఎందుకు హీరోయిన్ ను ఆవహిస్తుంది? వీరందరితో ఎందుకు దయ్యం వీరంగం చేస్తుంది? హీరో, దయ్యం కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెర మీదే చూడాలి.  టెక్నివల్ పరంగా నటీనటుల పరంగా , కథ పరంగా సినిమా అద్భుతమని కనిపిస్తుంది.. ఒక్కోసారి రొటీన్ కథే అంటూ గెస్ చేయవచ్చు అనుకునే లోపే ట్విస్ట్ లు మొదలవుతాయి.  నందిత శ్వేతా నటన సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు.  చివరగా మరో ట్విస్ట్ తో హాస్పిటల్ సన్నివేశమతో సినిమా శుభం కార్డు పడుతుంది.  ప్రేమకథా చిత్రం మొదటి భాగంతో పోలిస్తే .. ఈ సినిమా బాగుందని పబ్లిక్ అంటున్నారు.

దర్శకత్వం: హరి కిషన్
రచన : ఆర్ సుదర్శన్ రెడ్డి
నిర్మాత: ఆర్ సుదీర్ రెడ్డి
మ్యూజిక్ : జీవన్ బాబు
సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్
ఎడిటింగ్ : ఎస్ బి ఉద్ధవ్

Rating :2.5/5.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad