Home సినిమా టాలీవుడ్ న్యూస్ ‘జాంబీ రెడ్డి’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్న ప్రశాంత్ వర్మ

‘జాంబీ రెడ్డి’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్న ప్రశాంత్ వర్మ

zombie-reddy
zombie-reddy

టాలీవుడ్‌లో ‘అ’ వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ తరువాత కల్కి అనే సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఒకదానికొకటి పోలిక లేకపోవడంతో ఈ డైరెక్టర్ చేయబోయే తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

ఇటీవల ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో మునుపెన్నడూ రాని కాన్సెప్ట్‌తో వస్తుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకు ‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జాంబీ(zombie) చిత్రాలను అనగానే హాలీవుడ్ చిత్రాలు గుర్తుకువస్తాయి. ఇప్పుడు ఇలాంటి సినిమాను తెలుగులోనూ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా టాలీవుడ్‌లో తొలి జాంబీ చిత్రంగా ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ జరుపుకుంటుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అనే ఆతృత అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad