Home సినిమా టాలీవుడ్ న్యూస్ సీమ ప్రతాపం చూపిస్తానంటోన్న జోంబీ రెడ్డి డైరెక్టర్

సీమ ప్రతాపం చూపిస్తానంటోన్న జోంబీ రెడ్డి డైరెక్టర్

Prasanth Varma Gives Clarity On Zombie Reddy Title Issue

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన తొలి చిత్రం ‘అ’తో ఎలాంటి గుర్తింపును పొందాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ చిత్రాన్ని యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌తో కలిసి ‘కల్కి’ అనే టైటిల్‌తో తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా ‘జోంబీ రెడ్డి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కరోనా నేపథ్యంతో తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు.

కాగా ‘జోంబీ రెడ్డి’ అనే టైటిల్‌పై ఒక సామాజిక వర్గం వారు గుర్రుగా ఉన్నారు. ‘రెడ్డి’ అనే పదాన్ని టైటిల్‌లో ఎందుకు పెట్టాడో చెప్పాలంటూ వివాదానికి దారి తీశారు. దీంతో తాజాగా ప్రశాంత్ వర్మ, తన సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘జోంబీ రెడ్డి’ చిత్రంలో ఎవరినీ కించపరిచే అంశాలు లేవని, ఇదొక పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమని ఆయన చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ లాంటి ప్రమాదం రాయలసీమలోని కర్నూలు ప్రాంతంలో ప్రబలడంతో, అక్కడి ప్రజలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఆ ప్రమాదాన్ని వారు ఎలా జయించారు అనేది సినిమా కథగా ఉండబోతుందని, ఈ సినిమాతో ప్రపంచానికి ఓ మంచి సందేశం ఇవ్వడం కోసమే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామంటూ చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు.

మొత్తానికి జోంబీ రెడ్డి చిత్ర టైటిల్ వెనకాల చాలా కథే ఉందంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని ప్రశాంత్ వర్మ తేల్చి చెప్పాడు. కాగా టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తొలి జోంబీ చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయనున్న సంగతి తెలిసిందే.

Zombie Reddy | Title Response | Prasanth Varma | Apple Tree Studios
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad