Home సినిమా టాలీవుడ్ న్యూస్ నేను మోనార్క్ ని కరోనా నన్ను ఏం చేయలేదు

నేను మోనార్క్ ని కరోనా నన్ను ఏం చేయలేదు

Prakash Raj at calicut

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేస్తూ  వచ్చింది. దీనిలో భాగంగా అక్టోబర్ 1 నుండి అన్ లాక్ 4.0 మొదలుకానుంది. తాజాగా కేంద్రం అన్ లాక్  4.0లో భాగంగా సినిమా షూటింగ్ లకు అనుమతినిచ్చింది. సినీ పరిశ్రమకు ఇది కొంత కలిసి వచ్చే అంశం. మూవీ షూటింగ్స్ లేక దాదాపు గత నాలుగు నెలలుగా మూవీ స్టార్స్ గృహనిర్బంధంలోనే ఉన్నారు. గతంలో మా అసోసియేషన్ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే తర్వాత కరోనా ఉగ్ర రూపం చూసి మెజారిటీ నటులు షూటింగ్ కి దూరంగా ఉంటూ వచ్చారు.

తాజా కేంద్ర మార్గదర్శకాలతో కొంతమంది నటులు ఇల్లు విడిచి మూవీస్ లో అడుగు పెడుతున్నారు. ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. నేటి నుండే తన కొత్త సినిమా చిత్రీకరణలో పాలుపంచుకుంటున్నట్టు ఓ ట్వీట్ చేశారు. ‘‘స్టార్ట్ కెమెరా యాక్షన్.. బ్యాక్ టూ వర్క్’’ అంటూ ప్రకాష్ రాజ్ ఈ ముమెంట్ ను ట్వీట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సన్నివేశం దృశ్యాలను కూడా ఆయన ట్వీట్ లో పోస్ట్ చేశారు. 60 ఏళ్లు పైబడిన ప్రకాష్ రాజ్ ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కరోనా నుండి కోలుకొని షూటింగ్ లో పాల్గొన్నట్లు ప్రకటించారు. యంగ్ స్టార్స్ కరోనాకి భయపడుతుంటే సీనియర్ స్టార్స్ మాత్రం ధైర్యంతో ముందుకు వస్తున్నారు. పరిస్థితులు సమీక్షిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా కొద్ది రోజుల్లో షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad