
టాలీవుడ్లో స్టార్ హీరోహీరోయిన్లే కాకుండా క్యారెక్టర్ పాత్రల్లో మెప్పించిన వారు కూడా తమకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంటారు. ఈ కోవలోనే చాలా మంది స్టార్స్‌గా మారిపోయి తమ కెరీర్‌ను సెట్ చేసుకున్నారు. అలాంటి వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఎక్కువగా తల్లి పాత్రల్లో నటించే ప్రగతి, నిజానికి అంత వయస్కురాలు కాదు. అయితే ఆమెకు ఎలాంటి పాత్రలోనైనా లీనమై నటించడం అంటే ఇష్టమని, తనకు వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లింది.
కాగా ఆమెకు సినిమాల్లో ఉన్న ఫాలోయింగ్ కంటే కూడా సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మనం షాక్ తినాల్సిందే. తనదైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె ఇటీవల లాక్డౌన్ సమయంలో ఇంట్లో డ్యాన్స్ చేస్తూ పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో తుక్కురేగ్గొడుతున్నాయి. ‘ప్రగతి ఆంటీ ఇంత యంగ్‌గా ఉంటుందా..?’ అనే మాట నెటిజన్ల నోట ఎక్కువగా వినిపించింది.
అందంతో పాటు అభినయం మాత్రమే కాదు తనకు డ్యాన్స్ కూడా వచ్చు అంటూ ఆమె చేస్తున్న వీడియోలకు పెద్ద ఎత్తున లైకులు వస్తున్నాయి. ఇలా హాట్ హాట్ స్టెప్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ ఆంటీ.. సారీ నటి మున్ముందు ఎలాంటి సినిమాల్లో నటిస్తుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.