
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఎలాంటి గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విజువల్ వండర్‌గా తన సత్తా చాటడంతో ప్రభాస్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.
అయితే ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కించనుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా ప్రభాస్ ఈ స్థాయికి చేరుకోవడంత తనకు చాలా సంతోషంగా ఉందని రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్‌ను హాలీవుడ్లో చూడాలని ఆయన కోరారు.
మరి ప్రభాస్ ప్రస్తుతానికి నేషనల్ స్టార్ కావడంతో, త్వరలోనే ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను ప్రభాస్ షేక్ చేస్తాడని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు.