Home సినిమా టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ : ప్రభాస్ తో సమంత రొమాన్స్..?

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ : ప్రభాస్ తో సమంత రొమాన్స్..?

పెళ్లి తరువాత ఇంటికే పరిమితం అవుతుంది అనుకున్న సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఈమద్య కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన పాత్రలు మాత్రమే చేస్తు.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసింది. పెళ్లి తరువాత సమంతను మా సినిమాలో తీసుకోవాలా ? వద్ద అని భయపడ్డ దర్శక, నిర్మాతలు, హీరోలు సైతం ఇప్పుడు సమంతే కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఆమె డేట్స్ లేకపోయినా వేచిచూస్తున్నారు తప్ప మరో హీరోయిన్ తో కాంప్రమైజ్ అవ్వడం లేదు.

అంత క్రేజ్ ఉన్న శ్యామ్ ను వెతుక్కుంటూ మరో పెద్ద ఆఫర్ వచ్చింది. అదే బాహుబలి ప్రభాస్, సమంత కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా తెరకెక్కడం. అవును అతి త్వరలోనే సమంత, ప్రభాస్ తో రొమాన్స్ చేయనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తుంది. అలా అని ఇది కేవలం గాసిప్ కాదు.. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని తెలుస్తుంది.

ప్రభాస్ త్వరలోనే ప్రముఖ నిర్మాత “దిల్ రాజు” నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒక క్రేజీ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తోన్న “దిల్ రాజు”.. ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని సమాచారం.

ప్రభాస్ ప్రస్తుతం “సాహో” షూటింగులో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఇదేకాక గోపిచంద్ “జిల్” సినిమా ఫేమ్ “రాధాకృష్ణ” దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు “జాన్” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సమంత విషయానికి వస్తే తమిల్లో ఇప్పటికే రెండు పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది శ్యామ్. ఇవేకాక తెలుగులో కూడా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక నాగచైతన్య, శ్యామ్ జంటగా నటించిన “మజిలీ” త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad