Home సినిమా గాసిప్స్ “రాధే శ్యామ్” షూటింగ్ ఎప్పటి నుండి మొదలు కానుంది ?

“రాధే శ్యామ్” షూటింగ్ ఎప్పటి నుండి మొదలు కానుంది ?

maxresdefault 2 1

వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ కు కరోనా బ్రేక్ వేసింది. సాహో తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” సినిమాను ప్రారంభించి ఈ ఏడాది విడుదల చేయడానికి ప్రభాస్ సర్వం సిద్ధం చేసుకున్నాడు. అయితే సినిమా షూటింగ్ విదేశాల్లో కావడంతో కొంత ఆలస్యం అయింది. దానికి అదనంగా లాక్ డౌన్ రావడంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం చిత్రీకరణ జరుపుకుంది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సెప్టెంబర్ నుండి “రాధే శ్యామ్” రెగ్యులర్ షూటింగ్ ను  మొదలుపెట్టన్నారని తెలుస్తోంది. అయితే ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగడం మరోవైపు అంతర్జాతీయ విమానాలు సాధారణ ప్రేక్షకులను అనుమతించకపోవడంతో చిత్ర బృందం విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. అందుకే మూవీ టీం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేసి సినిమాను తెరకెక్కించన్నారని సమాచారం. సెప్టెంబర్ లో మూవీ షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ లోగా పూర్తి చేయాలని మూవీ టీం డెడ్లైన్ పెట్టుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కరోనా ఉన్నప్పటికీ ప్రభాస్ రిస్క్ చేయడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకటి మూడవ ప్రపంచ యుద్ధంలో నేపథ్యంలో తెరకెక్కనుండగా, మరొకటి పౌరాణిక ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే ముందు  “రాధే శ్యామ్” ను పూర్తి చేయవలసి ఉంటుంది. అందుకే రిస్క్ అయినా సరే ప్రభాస్ ఈ ఏడాది లోగా ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad