Home సినిమా మరో భారీ సినిమాను ప్లాన్ చేస్తోన్న ప్రభాస్

మరో భారీ సినిమాను ప్లాన్ చేస్తోన్న ప్రభాస్

Prabhas new movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను ‘జిల్’ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా ప్రభాస్ క్యూలో పెడుతున్నాడు.

ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పచ్చ జెండా ఊపేశాడు. ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇదిలా ఉండగానే, ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేసేందుకు రెడీ అయ్యాడు. రాధేశ్యామ్ హిందీ రిలీజ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్, ప్రభాస్‌తో కలిసి ఓ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాను నేరుగా హిందీలో తెరకెక్కించి ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి మైథలాజికల్ చిత్రంగా రానున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఇలా వరుసగా పాన్ ఇండియా చిత్రాలను ఓకే చేస్తూ దూసుకుపోతుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad