Home సినిమా టాలీవుడ్ న్యూస్ ప్ర‌భాస్ కెరీర్‌ గ్రాఫ్ .....

ప్ర‌భాస్ కెరీర్‌ గ్రాఫ్ …..

prabhas thumb 1

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డ‌మంటే అంత ఆషామాషీ విజ‌యం కాదు. ఒక్క హిట్ తోనే ఇండ‌స్ట్రీలో సెట్ కాలేరు. ఎన్నో సినిమాలు చేయాలి. వాటిలో మెజార్టీ హిట్లు ఉండాలి. అలా మాత్ర‌మే స్టార్ స్టాట‌స్‌ను పొంద‌గ‌లుగుతారు. సినీవార‌సుల‌కు ఇదే చిక్కు. తండ్రులు బాగా క‌ష్ట‌ప‌డి ఎలాగొలాగ నెట్టికొచ్చేస్తుంటారు.ఆ త‌ర్వాత వాళ్ల వార‌స‌త్వాన్ని మోసే స్టార్ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారుతుంది. ఈ క్ర‌మంలో కొంద‌రు స‌క్సెస్ అయితే..మ‌రికొంద‌రు మాత్రం వెనుక‌ప‌డి పోయారు. స‌క్సెస్ అయిన జాబితాలో అంద‌రికంటే ముందున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు సోద‌రుడి కుమారుడు. ఈశ్వ‌ర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి …..బాహుబ‌లితో వ‌ర‌ల్డ్ లెవెల్‌కి ఎదిగిపోయాడు. ఫ్యాన్స్ అత‌డిని డార్లింగ్ అని ముద్దుగా పిలుస్తారు. యంగ్ రెబ‌ల్ స్టార్ గా ప్ర‌భాస్ ఈశ్వ‌ర్ మూవీతో……. ఎంట్రీ ఇచ్చాడు. యాక్టింగ్, డ్యాన్స్‌, ఫైట్స్ లో త‌న‌దైన టాలెంట్ చూపిస్తూ ఎదిగాడు. బాహుబ‌లి త‌ర్వాత సాహోతో కూడా సౌత్ ఇండియా స‌త్తా చాటాడు. ప్ర‌స్తుతం కే రాధాకృష్ణ డైరెక్ష‌న్‌లో రాధేశ్యాం అనే సినిమా చేస్తున్నాడు.

త్వ‌ర‌లో వైజ‌యంతి బ్యాన‌ర్ లో ఒక పెద్ద పాన్ ఇండియా మూవీలో న‌టించ‌బోతున్నాడు. ఇక ప్ర‌భాస్ కెరీర్ విష‌యానికొస్తే…..2002లో వ‌చ్చిన ఈశ్వ‌ర్ ఏవ‌రేజ్‌గా నిలిచింది. 2003లో వ‌చ్చిన రాఘ‌వేంద్ర మూవీ ఫ్లాప్‌. ఇక మూడ‌వ సినిమాగా శోభ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌ర్షం సినిమ‌తో వ‌చ్చాడు. 2004లో వ‌చ్చిన వ‌ర్షం మూవీతో…. స్టార్ హీరో అయిపోయాడు. ఆ త‌ర్వాత అడ‌విరాముడు యావ‌రేజ్ గా నిలిచింది. 2005లో కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన చ‌క్రం….. డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. కానీ ప్ర‌భాస్ యాక్టింగ్ ప‌రంగా మంచి మార్కులే ప‌డ్డాయి. త‌ర్వాత ప్ర‌భుదేవా డైరెక్ష‌న్ లో వ‌చ్చిన పౌర్ణ‌మి కూడా ఫ్లాప్. ఇక వి వి వినాయ‌క్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన యోగి సినిమా యావ‌రేజ్‌. 2007లో మున్నా సినిమాతో …..మ‌రో ఫ్లాప్ మూట‌క‌ట్టుకున్నాడు. త‌ర్వాత పూరీ డైరెక్ష‌న్‌లో బుజ్జిగాడుగా వ‌చ్చాడు. అది కూడా ప్లాప్‌. 2009లో మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో బిల్లాగా వ‌చ్చాడు. అది కూడా యావ‌రేజ్‌. త‌ర్వాత మ‌ళ్లీ పూరీతో క‌లిశాడు . ఏక్ నిరంజ‌న్‌గా వ‌చ్చాడు. అది కూడా బిలో యావ‌రేజే. ఇక త‌ర్వాత 2010 డార్లింగ్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. 2011లో మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్ మూవీతో మ‌రో హిట్ అందుకున్నాడు.

ఆ త‌ర్వాత కొరియోగ్రాఫ‌ర్ రాఘ‌వ లారెన్స్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన రెబ‌ల్ అట్ట‌ర్ ప్లాప్ గా నిలిచింది. ఆ త‌ర్వాత 2013లో వ‌చ్చిన మిర్చితో మ‌ళ్లీ హిట్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఇక 2015లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో క‌లిసి చేసిన బాహుబ‌లి ది బిగినింగ్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు 2017లో బాహుబ‌లి ది కంక్లూజ‌న్ అంటూ ఆల్ టైం రికార్డు న‌మోదు చేసింది. రెండు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డ‌మే కాదు. వాటి రికార్డుల‌ని ఇంకా ఏదీ క్రాస్ చేయ‌లేదు. చేసే ఛాన్స్ కూడా క‌న్పించ‌డం లేదు. మొత్తం ప్ర‌భాస్ కెరీర్‌లో 19 సినిమాలు చేస్తే….అందులో ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు, 2 సెమీ హిట్స్‌, ఐదు యావ‌రేజ్‌లు, ఆరు ఫ్లాపులు ఉన్నాయి. ఇక సాహో ప్లాప్ అయిన‌ప్ప‌టికీ…బాలీవుడ్ లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్ట‌ప‌డే ప్ర‌భాస్‌కి.,….. త‌క్కువ మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఉన్న అంద‌రితోనూ క్లోజ్ గా మూవ్ అవుతాడు. డార్లింగ్ అంటూ ప్రేమ‌గా పిలుస్తుంటాడు. చివ‌ర‌కు అదే ప్ర‌భాస్‌కు బిరుదుగా మారిపోయింది. డ్యాన్సుల్లో కొంచెం ఇబ్బంది ప‌డ‌తాడేమోకానీ సెంటిమెంట్, ఫైట్స‌లో మాత్రం దుమ్ము దులిపేస్తాడు మ‌న డార్లింగ్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad