Home సినిమా గాసిప్స్ వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

Prabhas Interested In Web Series

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో చిత్రం తరువాత ప్రభాస్ ఇంకా ఏ సినిమాను రిలీజ్ చేయకపోవడంతో ఆయన సినిమాను ఎప్పుడు చూస్తామా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.

ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయిన ప్రభాస్, ఆ తరువాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాను ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ ఓ వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఓ భారీ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇదే గనక నిజం అయితే వెబ్ సిరీస్‌ల దర్శకుల పంట పండిందనే చెప్పాలి. బోల్డ్ కంటెంట్‌నే కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించే సత్తా వెబ్ సిరీస్‌లకు ఉంటుంది. మరి వారు తమ కంటెంట్‌లతో ప్రభాస్‌ను మెప్పించగలిగితే వారు పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ప్రభాస్‌ను మెప్పించే కంటెంట్‌ను ఏ డైరెక్టర్ రెడీ చేస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad