Home సినిమా రెమ్యునరేషన్‌తో అదరగొడుతున్న ప్రభాస్.. కండీషన్స్ ఇవే!

రెమ్యునరేషన్‌తో అదరగొడుతున్న ప్రభాస్.. కండీషన్స్ ఇవే!

prabhas thum

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు. మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.70 కోట్లు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమాను ఖచ్చితంగా ఏడాదిలోపే పూర్తి చేయాలని ప్రభాస్ కండీషన్ కూడా పెట్టాడట. ఇకపై తాను చేయబోయే సినిమాలన్నింటికీ ఇదే షరతు పెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట. దీంతో పాటు డబ్బింగ్ రైట్స్‌లో 50 శాతం వాటా కూడా డిమాండ్ చేస్తున్నాడు ప్రభాస్.

ఇలా ఇండియన్ సినిమాలో ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్, కేవలం పాన్ ఇండియా చిత్రాలకే ఓటు వేస్తుండటంతో, ఆయన చేసే సినిమాలు బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ 21వ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమా కోసం ఏకంగా రూ.17 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్‌తో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండబోతుందో వారి రెమ్యునరేషన్ చూస్తే తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad