Home సినిమా టాలీవుడ్ న్యూస్ మెగా ప్రొడ్యూసర్ వెనకడుగేస్తే దూసుకొచ్చిన ప్రభాస్

మెగా ప్రొడ్యూసర్ వెనకడుగేస్తే దూసుకొచ్చిన ప్రభాస్

Prabhas Cashes With Adipurush As Allu Aravind Backsteps

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే, తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీగా ‘ఆదిపురుష్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించేందు దర్శకుడు సిద్ధమయ్యాడు. కాగా ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించబోతున్నాడని, చెడుపై మంచి విజయం అనే క్యాప్షన్‌తో ఈ సినిమా వస్తుండటంతో ఆదిపురుష్ చిత్రంపై అప్పుడే భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించి, మిగతా భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే తొలుత ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తామని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గతంలో ప్రకటించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు అల్లు అరవింద్ అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండి వెనకడుగు వేశాడు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టును బాలీవుడ్ దర్శకనిర్మాతలు చేపట్టి, ప్రభాస్‌తో చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియా మూవీతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యాడని చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad