
బాహుబలి హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తికాకముందే తన నెక్ట్స్ రెండు చిత్రాలను కూడా లైన్లో పెట్టేందుకు డార్లింగ్ రెడీ అయిపోయాడు. మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌తో తన 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ ఓం రావుత్‌తో ఆదిపురుష్ అనే సినిమాను ఓకే చేశాడు.
కాగా ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటంతో యావత్ భారతదేశ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ అప్పుడే ట్రెయినింగ్ మొదలుపెడుతున్నాడు. ఈ సినిమాలో విలువిద్యను ప్రదర్శించాల్సి ఉండటంతో ప్రస్తుతం తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఆర్చరీ సెటప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ ప్రొఫెషనల్ ఆర్చరీ కోచ్‌ను కూడా పెట్టుకున్నాడట.
గతంలోనూ బాహుబలి చిత్రం సమయంలో విలువిద్య, కత్తి విన్యాసం వంటి విద్యలను ప్రొఫెషనల్ కోచ్ ఆధ్వర్యంలో ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఇలా సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభాస్ ఎంతటి హార్డ్‌వర్క్ చేస్తాడో మరోసారి నిరూపిస్తున్నాడు. ఇక ఆదిపురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెకండాఫ్‌లో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ప్రొడ్యూ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.