
బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా, కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అమ్మడి పాత్ర చాలా ట్విస్టుతో కూడుకుని ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే రెండు పాత్రల్లో కనిపిస్తుందని, అందులో ఒక పాత్ర సినిమా స్టార్టింగ్‌లోనే చనిపోతుందని తెలుస్తోంది. అటు రెండో పాత్రలో పూజా ఓ క్లాసికల్ డ్యాన్సర్‌గా నటిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఆమె పాత్ర కారణంగా ఈ సినిమా రివెంజ్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తోంది.
మొత్తానికి పూజా పాత్ర ఈ సినిమాకు పెద్ద ట్విస్టు ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా పూర్తికాక ముందే ప్రభాస్ వరుసగా సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.