
అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ, వరుసబెట్టి సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్ అందుకుంటోంది. ఈ బ్యూటీ నటిస్తున్న వరుస సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తుండటంతో అమ్మడు నటించే సినిమాలపై అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గా్ల్లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అవుతోంది.
కాగా ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఎక్కువ శాతం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా వేసుకుంది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లకు అనుమతి దొరకడంతో రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే తాను సినిమా షూటింగ్లలో పాల్గొనేందుకు సిద్ధమంటోంది ఈ బ్యూటీ. దీంతో రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ఆమెకు సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇక యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తుండటంతో ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి పూజా చేస్తున్న డేర్‌ను ఆయా చిత్రాల హీరోలు చేస్తారా అనేది సందేహంగా మారింది. ఏదేమైనా కరోనాను లెక్కచేయకుండా షూటింగ్‌లకు వస్తానంటోన్న పూజా పాపకు ప్రేక్షకులు హ్యాట్సాఫ్ కొడుతున్నారు.