
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌కు చుక్కలు చూపెట్టేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన పవన్, ఆ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే గతంలో గబ్బర్‌సింగ్ వంటి బిగ్గె్స్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన దర్శకుడు హరీష్ శంకర్, ఈసారి కూడా పవన్ కోసం ఓ కాప్ డ్రామాను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే అయితే బాగుంటుందని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నాడు. అందంతో పాటు స్టార్ హీరో పక్కన చేసే సత్తా ఆమెకు ఉండటంతో పవన్ లాంటి హీరో పక్కన ఆమె అయితే సినిమాకు బాగా కలిసొస్తుందని హరీష్ అనుకుంటున్నాడు.

మరి పవన్ సరసన నటించే ఛాన్స్ నిజంగానే పూజా అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఏదేమైనా ఈ సినిమాలో ఆఫర్ వస్తే మాత్రం పూజా హెగ్డే అమాంతం మరింత పెరిగిపోవడం ఖాయమని చెప్పాలి. కాగా ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటిస్తోంది.