Home సినిమా గాసిప్స్ పూర్వ జన్మల కథ ! : పూజా అపాత్ర చేస్తుందా ?

పూర్వ జన్మల కథ ! : పూజా అపాత్ర చేస్తుందా ?

unnamed 1

ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్. బాహుబలి సినిమాతో భారీ విజయం అందుకున్న ఈ మిర్చి హీరో తరువాత సాహోతో తన సత్తాను చాటుకున్నాడు. వరుస భారీ హిట్లు రావడంతో ప్రభాస్ రేంజ్ తారాస్థాయికి చేరింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ కేవలం భారీ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫ్రేం రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, హైడ్ ఎండ్ టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతోంది. గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అన్ని ఉత్తర దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. వాస్తవానికి తెలుగు నేటివిటి హిందీకి సరిపోదు. అందుకే తెలుగు దర్శకులు నార్త్ ప్రేక్షకుల్ని మెప్పించేలా తమ సినిమాలో అదనపు హంగులను అద్దుతారు. ఉదాహరణకు సాహొ సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడు. సినిమాలో ప్రత్యేక పాట కోసం “జాక్వలిన్ ఫెర్నాండెజ్” ను తీసుకున్నారు. ఇప్పుడు “రాధే శ్యామ్” విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంతో మొదటి సారిగా ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. పూజాకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. దానితో పాటు తెలుగులో అల వైకుంఠపురం వంటి సూపర్ హిట్ సినిమా కూడా ఉంది. దీంతో పూజా హెగ్డేను తీసుకోవడం ద్వారా రెండింట లాభాలను సంపాదించవచ్చు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం పూజా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. “రాధే శ్యామ్” పిరియాడికల్ డ్రామాగా రావడంతో రెండు వేర్వేరు పాత్రలు ఉంటాయని ఇప్పటికే అనేక మంది అనుకుంటున్నారు. అందులోనూ “రాధే శ్యామ్” పూర్వజన్మల కథని ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే డార్లింగ్ ఫాన్స్ కు క్రేజీ న్యూస్ దొరికినట్టే. ఈ ఊహాగానాలను పై మూవీ టీం స్పందించాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad