
టాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించి అదిరిపోయే సక్సె్స్ను అందుకుంది. ఈ బ్యూటీ నటిస్తున్న వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ అవుతుండటంతో ఆమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు స్టార్ హీరోలు మొదలుకొని యంగ్ హీరోల వరకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
అయితే టాలీవుడ్లో ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుస సినిమాల విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పరంగానూ టాప్ పొజిషన్లో నిల్చుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లను వెనక్కి నెట్టి మరీ అమ్మడు తన రెమ్యునరేషన్‌ను పెంచేసిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇప్పటికే యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ వంటి భారీ పాన్ ఇండియా మూవీలోనూ పూజా హెగ్డే నటిస్తోంది.
కాగా ఆ తరువాత నాగచైతన్య, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు చేయబోయే సినిమాల్లోనూ పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. మొత్తానికి చేతి నిండా ఆఫర్లు దక్కించుకోవడమే కాకుండా ఏకంగా టాప్ పొజిషన్‌తో టాలీవుడ్లో దూసుకుపోతున్న ఈ బుట్ట బొమ్మా, మున్ముందు ఎలాంటి విజయాలను అందుకుంటుందా అని పూజా హెగ్డే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల టాలీవుడ్ చిత్రాలకు పూజా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.