Home సినిమా 3.35 లక్షల రూపాయల టోకరా.. దండుపాళ్యం నటి ..!

3.35 లక్షల రూపాయల టోకరా.. దండుపాళ్యం నటి ..!

‘దండుపాళ్యం’ ఫేమ్ కన్నడ నటి పూజ గాంధీ వివాదాలకు సై అంటూనే ఉంటుంది. తాజాగా ఆమె మరో వివాదానికి తెరలేపింది. బెంగళూరు హోటల్ యాజమాన్యము పూజా గాంధీ పై కేసు పెట్టారు. దీంతో నటి మీడియాకు ఎక్కింది. ఇలాంటి వివాదాలు పూజకు ఏమాత్రం కొత్త కాదు. ప్రముఖ నిర్మాతైనా కిరణ్ తో పూజ 2011 లో డబ్బు పరంగానే పెద్ద యుద్ధం చేసింది. వీరిద్దరూ ఒకరి పై ఒకరు కేసులు కూడా వేసుకొని, పరువునష్టం దావా లు వేసుకుని రచ్చ చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పూజ గాంధీ ఆ మధ్య బెంగళూరు లోని ఒక హోటల్ లో బస చేసింది. కొన్ని రోజుల పాటు లగ్జరీ హోటల్ లో లైఫ్ కొనసాగించింది. లగ్జరీ హోటల్‌కు తగ్గట్టుగానే బిల్లు కూడా మారు మ్రోగిందనుకోండి. దాదాపుగా 3.5 లక్షల రూపాయలు అయ్యిందట. అంతే ఇక నటి బిల్లు కట్టకుండా అక్కడినుండి చెక్కేసింది. ఈ విషయాన్ని కొంచం ఆలస్యంగా తెలుసుకున్నారు హోటల్ యాజమాన్యం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పూజ మోసం చేసి, హోటల్ బిల్లు కట్టకుండా పరారైందని పోలీసులను ఆశ్రయించారు. ఈవిషయం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా సమాన్స్ పంపారు.

ఈ పరంగా పోలీసుల సమక్షంలో పూజ హోటల్ వారికి 22,83,129 రూపాయలను చెల్లించినట్లు, మిగిలిన డబ్బులు చెల్లించుటకు కొంత గడువు కావాలని హోటల్ యాజమాన్యాన్ని, పోలీసులను కోరిందట. హోటల్ యాజమాన్యంనకు, పూజ కు మధ్య ఒప్పందం కుదరడంతో వివాదం సర్దుమణిగింది. కానీ ప్రస్తుతానికి దండుపాళ్యం ఫేమ్ పూజ హోటల్ కు ఇచ్చిన టోకరా విషయమే హాట్ టాపిక్ గా మారింది.

2002 సంవత్సరంలో హిందీ చిత్రం ‘దుష్మణి’ తో పూజా గాంధీ ప్రేక్షకులకు పరిచయమైంది. దాదాపుగా యాభైకి పైగా సినిమాలలో నటించింది. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, భోజ్పురి లలో నటించింది. కన్నడములో నటించిన ‘దండుపాళ్యం’ ఫ్రాంచైజీ ద్వారా పూజా గాంధీకి దేశమంతటా మంచి గుర్తింపు లభించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad