Home సినిమా 'పీఎం నరేంద్ర మోదీ’ ట్రైలర్ రిలీజ్ ..!

‘పీఎం నరేంద్ర మోదీ’ ట్రైలర్ రిలీజ్ ..!

ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోదీ’ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ… స్టోరీ ఆఫ్ ఏ బిలియన్ పీపుల్’ టైటిల్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాను 23 భాషల్లో భారీస్థాయిలో భారతదేశము అంతటా ఎన్నికల సమయంలోపు విడుదల చేయుటకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీన సినిమా విడుదల కానుంది. దీనికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ .

ట్రైలర్ లో నరేంద్ర మోదీ చిన్నపుడు రైల్లో టీ అమ్మడం, ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవడం , గోద్రా అల్లర్లను, ఇందిరాగాంధీ మోదీని అరెస్ట్ చేపించడం వంటి సన్నివేశాలను చూడవచ్చును. ప్రధాన మంత్రి కావడం, విదేశీ పర్యటన చేయడం లాంటి తదితర సీన్స్ ను ట్రైలర్ లో వీక్షించవచ్చు.

త్రివర్ణ పతాకాన్ని చూసి నమస్కారం చేస్తున్న మోదిని ఒక వ్యక్తి ‘నువ్వు ఎందుకు జెండాను చూసి నమస్కారం చేస్తున్నావు’ అని ప్రశ్నించగా ‘నువ్వు మందిరం చూసి ఎందుకు నమస్కారం చేస్తావు’ అని చిన్నతనంలోనే మోదీ ప్రశ్నకు ప్రశ్నసమాధానం చెప్తాడు.

‘నేను సన్యాసిని కావాలని అనుకుంటున్నాను’, ‘దేశం కావాలనుకునే వారికీ ఇంకేమి అవసరం లేదు’, ‘ఉగ్రవాదులను చూసి హిందుస్థాన్ కాదు… హిందుస్థాన్ ను చూసి ఉగ్రవాదులు భయపడతారు’ అంటూ వినబడే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా.. ‘ఒక చాయ్ వాలా… ప్రధాని అవుతాడా?’ అనుకున్నవారందరికీ ప్రధాని అయి చూపిస్తాడు మోదీ. ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు ప్రేక్షుకులకు మరింత ఆకర్శించేలా ఉన్నాయి.

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత సురేష్ ఒబెరాయ్ కుమారుడైన వివేక్ ఒబేరాయ్ మోది పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని సురేష్ ఒబెరాయ్, సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. దర్శన్‌ కుమార్, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, ప్రశాంత్ నారాయణన్‌, జరీనా వాహబ్‌, సేన్‌ గుప్తా తదితర నటీనటులు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ ను అహమ్మదాబాద్, గుజరాత్, ఉత్తరాఖాండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లతో పాటు భారతదేశమంతటా పలు పలు ప్రదేశాల్లో చిత్రీకరించారు.

Read also: 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad