ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పీఎం నరేంద్ర మోడీ’.కాప్షన్ పరంగా చూసుకుంటే దేశ్ భక్తి యే మేరా శక్తి . ఈ చిత్రంలో నరేంద్ర మోడీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం లో రూపుదిద్దుకున్న సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో వివేక్ ఓబరాయ్ 9డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఒక చాయ్ వాలాగాను, గుజరాత్ ముఖ్యమంత్రిగాను, దేశ ప్రధాని గాను, నరేంద్ర మోడీ జీవితంలో జరిగిన ప్రతి ఘటనను గెటప్‌లలో చూపించనున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయాన ప్రధాన మంత్రి బయోపిక్ ను విడుదల చేస్తే ఓటర్ల మనోభావాల మీద ప్రభావం చూపుతుందని, సార్వత్రిక ఎన్నికలు జరుగు వరకు చిత్ర రిలీజ్ ను ఆపు చేయవలసిందిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు.
ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరంగా సినిమాను ఆపు చేసే అధికారం మాకు లేదంటూ చెప్పేసింది ఈ చిత్రం మీద ఏ విధమైన నిర్ణయమైనా సెంట్రల్ సెన్సార్ బోర్డ్ తీసుకుంటుందని ఈసీ వర్గాలు తెలియచేశాయి. ఇదివరకే సినిమా రిలీజ్ ఆపాలని బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు అయింది. ఇక బాంబే కోర్టు మాత్రం సినిమా విడుదల విషయం కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుందని తీర్పు చెప్పింది. ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ అంటూ కోర్ట్… సెన్సార్ బోర్డు అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. లోక్‌సభకు ఎన్నికలకు వారం రోజులు ముందుగా విడుదవుతున్న ఈ సినిమా ఓటర్లు మీద ఎలాంటి ప్రభావము చూపుతుందో చూడాలి.