Home సినిమా గాసిప్స్ యాంకర్ ప్రదీప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన చిన్నది.. ఎవరో తెలుసా?

యాంకర్ ప్రదీప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన చిన్నది.. ఎవరో తెలుసా?

Pelli Choopulu Winner Gnanewsari Comments On Anchor Pradeep

టాలీవుడ్‌లో బుల్లితెర యాంకర్లలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే తన కెరీర్‌లో ఎలాంటి వివాదాలకు తావివ్వని ప్రదీప్, పలు రియాలిటీ షోలతో కూడా ఎనలేని క్రేజ్‌ను సాధించాడు. కాగా ‘పెళ్లిపూపులు’ అనే షో గురించి తెలుగు ఆడియెన్స్‌కు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ షో ప్రారంభంలో ఇది ప్రదీప్ పెళ్లిచూపులు అని చాలా మంది అనుకున్నారు.

అయితే అది కేవలం రియాలిటీ షో మాత్రమే అని తరువాత తెలుసుకున్నారు. కాగా ఆ షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి తన అందంతో పాటు చలాకీతనంతో బుల్లితెర ప్రేక్షకులతో పాటు యాంకర్ ప్రదీప్‌ను కూడా మెప్పించింది. కాగా ఈ షోలో విన్నర్‌గా నిలిచిన జ్ఞానేశ్వరి, నిజంగానే ప్రదీప్‌ను ప్రేమించి పెళ్లాడబోతుందనే వార్త అప్పట్లో టాలీవుడ్‌లో తెగ షికారు చేసింది. అయితే ఇలాంటి వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని జ్ఞానేశ్వరి ఓ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పింది.

సినిమా రంగానికి ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌ లేకుండా కేవలం తన ఆసక్తిపైనే వచ్చానంటూ చెప్పుకొచ్చిన జ్ఞానేశ్వరి, యాంకర్ ప్రదీప్ చాలా మంచి వ్యక్తి అంటోంది. ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ కావడంతో అందరి చూపు ఆయన వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారని, అందులో భాగంగానే ఆయనతో తనకు పెళ్లి జరిగిందని, ప్రేమలో ఉన్నానని లాంటి వార్తలు పుట్టుకొచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి పుకార్లను జనం ఈజీగా నమ్మేస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా యాంకర్ ప్రదీప్‌తో చేసిన ‘పెళ్లిచూపులు’ షో తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది.

Pelli Choopulu Winner Gnaneswari Comments On Anchor Pradeep || Sumantv News
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad