Home సినిమా పవన్ పవర్ చూపిస్తున్నాడు : మంచు మనోజ్

పవన్ పవర్ చూపిస్తున్నాడు : మంచు మనోజ్

ఆరు నెలల క్రితం మిర్యాలగూడ లోని ప్రణయ్ హత్య కేసులోనూ, మొన్న బర్కత్ పురలో మధులిక పై జరిగిన దాడి విషయంలోనూ స్పందించాడు మంచు మనోజ్ ఈ మధ్య సామాజికంగా జరిగే ప్రతి విషయం పట్ల సానుకూలంగా స్పందించడం మొదలు పెట్టాడు. రాజకీయాల పరంగాను, ప్రేమ పేరుతో జరుగుతన్న దాడుల సంఘటనలో కూడా ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల్లో తన యొక్క సలహాలను కూడా పంచుకుంటున్నాడు.

తాజాగా రాజకీయాల్లో చేరుతున్న విద్యావంతులు , వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, యువకులు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా సేవ చేయాలనే ఉద్దెశంతో కొందరు విద్యావంతులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు నిన్న జనసేన పార్టీలో చేరారు. ఇలా పార్టీలోకి విద్యావంతులు చేరేందుకు ముందుకు రావడాన్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్వాగతించారు. దీనివల్ల ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

pawan 1

ఈ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. విద్యావంతులు, నిపుణుల మీద ఉన్న నమ్మకంతో వీరికి పవన్ కల్యాణ్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాజకీయాలు విద్యావంతుల చేతుల్లోకి తీసుకరావాలనే ఆలోచన గల పవన్ ని మంచు మెచ్చుకున్నారు. ఈ సంధర్బంగా ట్విట్టర్ లో స్పందించిన మనోజ్ నిపుణులు పొన్ రాజ్, పుల్లారావు లాంటి వారు జనసేనలో చేరిన సందర్భంగా తీసిన ఫొటోను ట్వీట్ కు జత చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad