Home సినిమా టాలీవుడ్ న్యూస్ మరో సినిమాను కన్ఫమ్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

మరో సినిమాను కన్ఫమ్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan Next Movie With Surender Reddy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులపై పవన్ కన్నేశాడు. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్నాడు పవన్. ఇక ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న పవన్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ‘గబ్బర్‌సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. కాగా ఇప్పుడు తాజాగా పవన్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి వంటి హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఈ డైరెక్టర్, తన నెక్ట్స్ మూవీ కోసం చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతున్నాడు.

కానీ ఎవరూ తనకు ఛాన్స్ ఇవ్వకపోవడంతో, పవన్ కళ్యాణ్ వద్దకు చేరుకున్నాడు. దీంతో ఆయన ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తుండగా రామ్ తాళ్లూరితో కలిసి పవన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్‌లో 29వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad