
పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పవన్ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేసేందుకు ఆయన నటిస్తున్న తరువాత చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను కూడా నేడు రిలీజ్ చేసేందుకు ముహూర్తి ఫిక్స్ చేశారు.
ఈ క్రమంలోనే పవన్ నటిస్తు్న్న 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో పవన్ రాబిన్ హుడ్ తరహా గెటప్‌లో మనకు కనిపిస్తున్నాడు. మెడలో ఎర్రటి గుడ్డతో ఈ సినిమా కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో పవన్ ఉన్నవారిని దోచుకుని పేదవారికి పెట్టే పాత్రలో నటిస్తున్నాడని, ఈ పాత్ర సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను అనుకున్నప్పటికీ ఇంకా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా పలువురు పేర్లు వినిపించగా, అందులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండేజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు టైటిల్ ఏమిటి, హీరోయిన్లు ఎవరు అనే విషయం తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.