Home సినిమా టాలీవుడ్ న్యూస్ కోర్టుకు వెళ్తానంటోన్న వకీల్ సాబ్..?

కోర్టుకు వెళ్తానంటోన్న వకీల్ సాబ్..?

Pawan Kalyan Interested To Start Shooting For Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరికొంత షూటింగ్ మిగిలి పోవడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలవుతుందో లేదో అని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాడట. అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని పవన్ ఆలోచిస్తున్నాడట. కేవలం 20 రోజుల షూటింగ్ కాబట్టి డిసెంబర్‌లోనే ముగించేయాలని సంక్రాంతి నాటికి సినిమాను రిలీజ్‌కు రెడీ చేయాలని పవన్ భావిస్తున్నాడట.

మొత్తానికి పవన్ తిరిగి షూటింగ్‌లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో రాబోయే సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను వేసవిలోగా పూర్తి చేసి, ఆ తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad