Home సినిమా గాసిప్స్ జాతర మొదలుపెట్టిన పవన్..!

జాతర మొదలుపెట్టిన పవన్..!

Pawan Kalyan Harish Shankar Movie Update Time

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్‌ను దాదాపు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన పవన్, తాజాగా తన పుట్టినరోజు కానుకగా మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

పవన్ బర్త్‌డే సందర్భంగా తన తాజా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారు అనౌన్స్ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 2న సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఉండబోతున్నట్లు వారు అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ జాతర చేసేందుకు రెడీ అవుతున్నారు.

తమ అభిమాన హీరోకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ వస్తుండటంతో వారు దానికోసం అప్పుడే ఎదురుచూస్తున్నారు. కాగా దర్శకుడు క్రిష్‌తో చేస్తున్న సినిమాకు సంబంధించి కూడా ఏదైనా అప్‌డేట్ ఉంటుందేమో చూడాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పవన్-హరీష్ శంకర్‌ల కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad