Home సినిమా 2004 మే 12న రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పని : అది ఆయన గొప్పతనం...

2004 మే 12న రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పని : అది ఆయన గొప్పతనం – పరుచూరి

పరుచూరి పలుకులు అంటూ “పరుచూరి గోపాలకృష్ణ” గారు ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఛానెల్ ల్లో తన జీవితంలోని అనుభవాలను.. జరిగిన సంఘటనలను ఆడియన్స్ తో పంచుకుంటున్నారు పరుచూరి. అందులో బాగంగా ఈమద్య స్వర్గీయ “YS రాజశేఖర్ రెడ్డి”తో తన మొదటి పరిచయం.. అతడితో ఉన్న అనుభవాలను చెప్పుకొచ్చారు పరుచూరి. “శ్రీరాములయ్య” సినిమా ఓపెనింగ్ రోజు జరిగిన బాంబ్ బ్లాంస్ట్ జరిగిన విషయం తెలిసిందే.. ఆ ఘటనలో నటుడు “మోహన్ బాబు” గాయాలపాలయ్యాడు. దాంతో అతడిని చూడడానికి పరుచూరి గోపాల కృష్ణ హాస్పటల్ కి వెళ్ళాడు. అప్పుడే మొదటిసారి రాజశేఖర్ రెడ్డిని చూశారు ఆయన. పరుచూరిని చూసిన రాజశేఖర్ రెడ్డి గారు వెంటనే “ఏం పరుచూరి గారు ఎలా ఉన్నారు ? బాగున్నారా ?” అని పలకరించారు.

ఆయన మాటలు విని పరిచూరి షాక్ కి గురయ్యాడనే చెప్పాలి. అతడిలాంటి పొలిటీషన్స్ కి సినిమా వాళ్ళు గుర్తుంటారా ? అనుకున్నాను.. కానీ నన్ను కూడా గుర్తుపెట్టుకున్నాడు అంటే అతడు నిజంగా గొప్పవాడే అని ఆరోజే రాజశేఖర్ రెడ్డి గారిపై పరుచూరికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ తరువాత మళ్ళీ అతడిని ఎప్పుడు కలవలేదు పరుచూరి. కానీ 2004 మే 11న ఆయన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో TDP పార్టీ తరుపున “అధికార భాష సంఘం అధ్యక్షుడు”గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి తన పదవికి రాజీనామా చేస్తూ మే 12న తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ అధికారులకు పంపించాడు.

కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం పరుచూరి గారిని రాజీనామా చేయకుండా పదవిని కొనసాగించాలని అప్పటి CS “మోహన్ కందా” గారితో చెప్పించాడు. “రాజశేఖర్ రెడ్డి” గారు అలా చెప్పడం అతడికి చాలా సంతోషం అనిపించింది. కానీ అది భావ్యం కాదని.. రెడ్డి గారు నాపై ఉంచిన నమ్మకానికి అతడికి నా కృతజ్ఞతలు చెప్పండని “మోహన్ కందా” గారితో చెప్పారు పరుచూరి. ఆ తరువాత అతడు సభ్యుడిగా ఉన్న అన్నీ పదవులకు రాజీనామా చేశారు. కానీ ఒక్క “తెలుగు విశ్వ విద్యాలయం”లోని పాలక మండలి సభ్యత్వానికి మాత్రం పరుచూరి రాజీనామా చేయలేదు.

ఎందుకంటే “తెలుగు విశ్వ విద్యాలయం” అంటే ఎన్‌టి‌ఆర్ మానస పుత్రిక.. ఎన్‌టి‌ఆర్ గారికి చాలా ఇష్టం.. అలాంటి సంస్థలో ఉన్న ఆ పదవి నుంచి తప్పుకోవడం పరుచూరికి ఇష్టం లేదు. ఆ పదవికాలం ఇంకా రెండేళ్ళు ఉంది. ఈమద్యలో కొత్త ప్రభుత్వం ఎలాగూ కొత్తవాళ్లను నియమిస్తారు కాబట్టి వాళ్ళు తీసెసే వరకు ఈ ఒక్క పదవిలో కొనసాగుదాం అనుకున్నాడు. కానీ YSR మాత్రం పరుచూరి రెండేళ్ల పదవీకాలం అయ్యేవరకు అతడిని పదవి నుండి తోయాలగించలేదు. అది రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనం అంటూ ఒకప్పటి జ్ఞాపకాలను బయటపెట్టరు పరుచూరి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad