Home సినిమా టాలీవుడ్ న్యూస్ పాపం సినిమా థియేటర్లు : ఎంత కష్టం వచ్చిపడింది

పాపం సినిమా థియేటర్లు : ఎంత కష్టం వచ్చిపడింది

1321288 shutterstock 1333826138 526064

లాక్ డౌన్ కారణంగా దేశంలోని థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీనితో మెజారిటీ ప్రేక్షకులు ఓటీటీ పై ఆసక్తి కనబరుస్తున్నారు. దర్శకనిర్మాతలకు థియేటర్లో అందుబాటులో లేకపోవడం, సినిమా హాళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయి కచ్చితమైన సమాచారం లేకపోవడంతో చిన్న, మద్య తరహ సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫాం జోరు పెరిగింది. పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే  ఓటీటీలు సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయమా అనే విధంగా తయారైంది. వాస్తవానికి ఓటీటీ యజమానులు మరికొన్ని రోజులు థియేటర్స్ తెరచుకోకూడదని అనుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు.

వాస్తవానికి ఓటీటీలు థియేటర్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే థియేటర్స్ తెరిస్తే అసలైన విషయం బయట పడుతుందని వీరి అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం థియేటర్లు తెరిచే పరిస్థితి దాదాపు లేనట్టే. ఒక వేళ తెరిచినా దానికి సవాలక్ష కండిషన్ లు ఉండే అవకాశం ఉంది. సోషల్ డిస్టెన్స్, ఓపెన్ ఎయిర్ వంటి నియమ నిబంధనలను థియేటర్లో అమలుపరచడం దాదాపు అసాధ్యం. అన్నింటికి మించి ప్రేక్షకులు తమ ప్రాణాలను పనంగా పెట్టి థియేటర్ కు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక వేల వచ్చినా వారి సంఖ్య సినిమా నడిపించడానికి అవసరమయ్యే ఖర్చు కంటే ఎక్కువ. ఈ విషయం ఓటీటీలకు స్పష్టంగా తెలుసు. అందుకే దియేటర్ లు తెరుచుకొని ప్రేక్షకులు చేతనే థియేటర్ల కంటే ఓటీటీ బెస్ట్ అని అనిపించుకోవడానికి తహతహలాడుతున్నాయి.

ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ఓటీటీలు ఎప్పటికీ థియేటర్లకు ప్రత్యామ్నాయం కావని అన్నారు. కానీ వారికి అసలు నిజం ముందే తెలుసు అందుకే వారే స్వయంగా ఆహా అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను తయారు చేసుకున్నారు. అంటే థియేటర్ లు తెరుచుకున్న& మూసివున్న అల్లు అరవింద్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. వారికి ఎలానో సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంది దాని ద్వారా లాభాలు రావడం ఖాయం. థియేటర్లు తెరుచుకున్న అవి వీకెండ్ ఎంటర్టైన్ మెంట్ కే పరిమితమైయన్నది నమ్మలేని నిజం. దీనివలన థియేటర్లపై ఓటీటీలదే పైచేయిగా మిగులుతుంది. అందుకే ఓటీటీలన్నీ థియేటర్ల ఓపెనింగ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.     

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad