Home టాప్ స్టోరీస్ ఓటీటీ ప్లాట్ ఫాం వలన మంచి జరగనుందా ?

ఓటీటీ ప్లాట్ ఫాం వలన మంచి జరగనుందా ?

download 3
Video archives concept.

కరోనా ప్రభావం వలన మూవీ ఇండస్ట్రీ భారీగా నష్టపోయిందని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా విశ్లేషించినట్లయితే ఒకప్పటితో పోలిస్తే నేడు ఇండస్ట్రీ భారీ లాభాల బాట పట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఒకప్పుడు కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే థియేటరర్స్ అందుబాటులో ఉండేవి. చిన్న మధ్యతరగతి సినిమాలకు కనీసం మల్టీప్లెక్స్ లుల్లో సింగిల్ స్క్రీన్ లు కూడా లభించేవి కావు. కానీ నేడు పరిస్థితి మారింది. చిన్న మధ్య తరహా సినిమాలకు ఓటీటీ  మంచి ప్లాట్ ఫాంగా తయారయ్యింది. ఇక్కడ స్క్రీన్ ల కోసం ఇక్కట్లు ధర్నాలు ఉండనే ఉండవు. అన్నిటికీ మించి సినిమా విడుదలకు ముందే లాభాలు ప్రొడ్యూసర్ చెంతకు చేరుతాయి.

అదే సినిమా థియేటర్లో అయితే సినిమా సక్సెస్ అయ్యి కలెక్షన్లు వస్తే తప్ప లాభాలు ప్రొడ్యూసరకు రావు. ఓటీటీ సంస్థలు నిర్మాణ వ్యయం కంటే అధిక మొత్తాన్ని చెల్లిస్తుండడంతో నష్టం అనే మాట దాదాపు లేనట్టే. రెండు నెలల క్రితం కీర్తి ఇచ్చిన సురేష్ పెంగ్విన్  సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు గాను సదరు సంస్థ దాదాపు ఏడు కోట్ల రూపాయలు చెల్లించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విజయం సాధించలేక ప్రైమ్ లో తక్కువ రేటింగ్ తో స్ట్రీమ్ అవుతుంది. అదే నిర్మాతలు థియేటర్లలో విడుదల చేసినట్లయితే సినిమా ఫ్లాప్ అయ్యి భారీ నష్టాలు వచ్చేవి. కానీ పెంగ్విన్ ఓటీటీలో నష్టాల నుండి తప్పించుకుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఆధారపడని బడా నిర్మాణ సంస్థలు తామే సొంతంగా ఓటీటీ వేదికలను తయారు నిర్మించుకుంటాయి. ఇప్పటికే అల్లు అరవింద్ విడుదల చేసిన ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ భారీ లాభాలను అందిస్తోంది.

ప్రస్తుతం థియేటర్లు మూత పడే ఉన్నప్పటికీ అల్లుఅరవింద్ తను నిర్మించే సినిమాలలో ఈ వేదిక మీద ప్రచారం చేసి భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. ఇక మధ్య తరహా సినిమాలకు కూడా ఓటీటీ మంచి వేదిక అనే చెప్పాలి. నాని నటించిన వి మూవీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాకు అమెజాన్ దాదాపు 37 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని మార్కెట్ 25 కోట్లు, సినిమా బడ్జెట్ 30 కోట్లు. అంటే టేబుల్ ప్రాఫిట్ తోనే దిల్ రాజు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. థియేటర్లలో అవకాశం దొరకని  మధ్య తరహా సినిమాలకు  ఓటీటీ ఒక మంచి అవకాశాన్ని కల్పించడంతోపాటు ప్రొడ్యూసర్లకు లాభాలను తీసుకు వస్తున్నాయి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad