Home టాప్ స్టోరీస్ ఓటీటీకి చెమటలు పట్టిస్తున్న పైరసీ

ఓటీటీకి చెమటలు పట్టిస్తున్న పైరసీ

OTT video piracy

లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు, మల్టీప్లెక్స్ లు మూతపడ్డాయి. దీంతో మెజారిటీ ప్రజలు ఓటీటీ పై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో నిర్మాతలు కూడా ఆన్ లైన్ ఓటీటీ వేదికలో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్నది చెప్పడం ఎవరికి సాధ్యపడడం లేదు. ఒకవేళ థియేటర్స్ తెరుచుకున్న మునుపటిలా ప్రేక్షకులు రారన్నది అక్షర సత్యం. దీంతో నిర్మాతలు చేసేదేమీ లేక తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ డిజిటల్ వేదికలకు పైరసీ భూతం సవాలు విసురుతోంది.

వాస్తవానికి థియేటర్స్  తెరుచుకున్న సమయంలోనే పైరసీ రక్కసి భారీగా ఉంది. సినిమా విడుదలైన క్షణాల్లోనే ఆ సినిమా పైరసీ వెబ్ సైట్లలో దర్శనమిచ్చేది. కొన్ని సందర్భాల్లో సినిమా విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ అయ్యి హల్ చల్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. థియేటర్స్ లో భారీ సెక్యూరిటీ ఉన్నప్పుడే ఆగని పైరసీ నిర్వాహకులు సినిమాలు డిజిటల్ వేదికలోకి వచ్చిన తర్వాత తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఏకంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫిక్స్ కంటే ముందే సినిమాలను తమ వెబ్ సైట్లలలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, టుడే పీకే, తమిళ్ ఎమ్వి వంటి వెబ్ సైట్లు ఓటీటీలో సినిమా విడుదలైన వెంటనే వాటిని తమ పైరసీ వెబ్ సైట్లలో స్ట్రీమ్ చేస్తున్నారు.

ఈ తతంగం మొత్తం టొరెంట్ క్లైంట్ వేదికగా జరగడంతో పోలీసులకు సవాలుగా మారింది. ప్రభుత్వం, పోలీసులు ఈ వెబ్ సైట్లను ఎన్నిసార్లు బ్లాక్ చేసినప్పటికీ సైబర్ క్రిమినల్స్ కొత్త డొమైన్ తో  ముందుకు వస్తున్నారు. ఆడియన్స్ కూడా సినిమాలు ఉచితంగా లభిస్తున్నాయని వీటిని ఆదరించటం వారికి కలిసొస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లు ఐపిలను బ్లాక్ చేసినప్పటికీ నిర్వాహకులు మరియు యూజర్లు ప్రాక్సీ మరియు విపీన్ వంటి సాఫ్ట్ వేర్లని వినియోగించే నిషేధిత వెబ్ సైట్లను అన్ బ్లాక్ చేస్తున్నారు. దీంతో అమెజాన్, నెట్ ఫ్లిక్ష్, డిస్నీ హాట్ స్టార్ వంటి పేరుపొందిన ఓటీటీ సంస్థలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి.

పైరసీ వెబ్ సైట్లలో లభించే సినిమాలు నాణ్యతా పరంగా ఉన్నత విలువలు కలిగి ఉండటం వలనే యూజర్లు అటువైపుగా అడుగులు వేస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది కోట్ల రూపాయిలు ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad