Home టాప్ స్టోరీస్ నిర్మాతలను భయపెడుతున్నఓటీటీ రూల్స్

నిర్మాతలను భయపెడుతున్నఓటీటీ రూల్స్

KUBgEDBIZsE1GcWmk5sI

ప్రస్తుతం కరోనాతో  థియేటర్లు మూత పడ్డాయి ఎప్పుడు తెరుచుకుంటాయన్నది దాదాపు ఎవరికి తెలియని పరిస్థితి. ఈ సమయాన్ని ఓటీటీ యాజమాన్యాలు అద్భుతంగా వినియోగించుకున్నాయి. థియేటర్లు లేకపోవడంతో నిర్మాతలు సినిమాలను విడుదల చేయలేక నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు ఫైనాన్షియర్ లు నిర్మాతలపై తీవ్ర ఒత్తిడి చేయడంతో ఇండస్ట్రీలో ఆందోళన పరిస్థితి నెలకొంది. సినిమాలు ఎక్కువ కాలం విడుదల చేయకుండా ఉంచినట్లయితే ప్రేక్షకులకి సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. మరోవైపు ఈ సమయంలో భారీగా వడ్డీలు కూడా కట్టవలసి వస్తుంది. అందుకే మెజారిటీ దర్శకులు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇండస్ట్రీలో నెలకొన్న ఈ సందిగ్ధ  వాతావరణాన్ని ఓటీటీ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా నాని నటించిన వి విచిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కొనే సమయంలో అమెజాన్ కొన్ని షరతులను పెట్టిందట. సినిమా విడుదలకు దాదాపు రెండు వారాల ముందు నుండే దర్శక నిర్మాతలు ప్రమోషన్ చేయాలని పట్టుబట్టింది. ఓ సాధారణ సినిమా విడుదలైతే ఏ విధంగా ఇంటర్వ్యూ, ప్రమోషన్లు చేస్తారో అదే విధంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే సినిమాలకు కూడా చేయాలనీ నిబంధన విధించినట్లు తెలుస్తోంది.

గతంలో ఇటువంటి నిబంధనలు లేవు. ఓటీటీలో సినిమా విడుదల అవుతున్నప్పటికీ మెజారిటీ ప్రేక్షకులకు ఆ విషయం తెలియక పోవడంతో ఇంటరెస్ట్ చూపించడంలేదు. అందుకే అమెజాన్ ప్రైమ్ ఈ నిబంధన తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నెట్ ఫ్లిక్ష్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తమ దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్టు] తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కు ఒకసారి సినిమాను విక్రయించే తర్వాత దానిని ఎప్పుడు విడుదల చేయాలన్నది సదరు సంస్థే నిర్ణయిస్తుంది. ఇందులో దర్శకనిర్మాతలు జోక్యం చేసుకునే అవకాశం లేదు. మరోవైపు తెలుగు ఓటీటీ ఆహా కూడా ఇటువంటి నిబంధనలనే విదిస్తునట్టు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad