Home సినిమా గాసిప్స్ బూతుకు పట్టాభిషేకం చేస్తోన్న ఓటీటీ

బూతుకు పట్టాభిషేకం చేస్తోన్న ఓటీటీ

Only Bold Content Given Importance In OTT

ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లు, సీరియళ్లు చూడాలంటే టీవీలే దిక్కు. కాలం మారినకొద్దీ యూట్యూబ్ లాంటివి రాగా, ఇప్పుడు ఓటీటీలు దుమ్ములేపుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు ఓటీటీలు చూపిస్తున్న కంటెంట్ విషయానికి వస్తే కొంతమేర ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. ఆర్ట్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, కమర్షియల్ సినిమాలకంటే కూడా బోల్డ్ కంటెంట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోన్న ఓటీటీలు అసలు ప్రేక్షకులకు తమ కంటెంట్‌లతో ఏం చెప్పాలని చూస్తుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఆర్ట్ సినిమాలకు థియేటర్లలోనూ ఆదరణ తగ్గిపోవడంతో హీరో ఫార్ములా చిత్రాలకు జనం అలవాటుపడ్డారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో ఓటీటీలపై ఆసక్తి చూపుతున్నారు జనం. అయితే ఓటీటీలో బోల్డ్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకే ప్రాధాన్యత ఉండటంతో ట్యాలెంట్ ఉన్న వాళ్లు కూడా అదే తరహా కథలతో వస్తున్నారు. దీంతో ఆర్ట్, ఫ్యామిలీ సినిమాల క్రేజ్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ రెండు జోనర్లు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందని వారు అంటున్నారు.

కాగా ప్రస్తుతం బూతు కంటెంట్, హింస లాంటి కథలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఓటీటీలపై పలువురు మండిపడుతున్నారు. అసలు ఓటీటీలు ‘బూతు’ను ఇంతలా ఎందుకు ప్రోత్సహిస్తుందా అనే సందేహం అందరిలో నెలకొంది. బోల్డ్ కంటెంట్ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు అంటూ విచ్చలవిడిగా శృంగారాన్ని ఎంకరేజ్ చేసే కథలే ఓటీటీలు ప్రేక్షకులపై రుద్దుతున్నాయి. ఏదేమైనా బూతు అనే పదానికి కేరాఫ్‌గా మారిపోయి ఆ కోవకే చెందిన కంటెంట్‌కు పట్టాభిషేకం చేస్తున్నాయి ఈ ఓటీటీలు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad