Home సినిమా రానా మిహికాల పెళ్లికి ఆ 30 మందికే ఆహ్వానం..వేదిక ఎక్క‌డంటే...

రానా మిహికాల పెళ్లికి ఆ 30 మందికే ఆహ్వానం..వేదిక ఎక్క‌డంటే…

rana mihika thumb

టాలీవుడ్ లో యువ‌హీరోలంతా వ‌రుస‌గా పెళ్లి పీట‌లెక్క‌తున్నారు. కరోనా పుణ్యాన పాపం పెళ్లి పీఠలు ఎక్కిన తెలుగు హీరోల పెళ్ళిళ్ళన్నీ….. అత్యంత సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఇప్ప‌ట్లో కొవిడ్ త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో పెళ్లి కోసం ఎదురుచూపులు అన‌వ‌స‌ర‌మ‌నే భావ‌న‌లో ఉన్నారు. అందుకే ఆల‌స్యం చేయ‌కుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు సుజిత్….అంత‌కు ముందు నితిన్‌, నిఖిల్‌, దిల్ రాజు ఇలా వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఇక ఈ జాబితాలోకి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌ల‌ర్స‌లో ఒక‌రైన ద‌గ్గుబాటి రానా కూడా చేర‌నున్నారు. త‌న లాంగ్ టైమ్ ఫ్రెండ్ మిహికా బ‌జాజ్‌తో క‌లిసి ఏడు అడుగులు వేయ‌నున్నాడు. ఇప్ప‌టికే నిశ్చితార్ధం అయిపోయింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. కుటుంబంలో చాలారోజుల తర్వాత శుభకార్యం జరుగుతుండడంతో దీన్ని బాగా గ్రాండ్ గా నిర్వహించాలని రానా తండ్రి సురేష్ బాబు అనుకున్నారట. కానీ కొవిడ్ దెబ్బ‌కు ఆ ఆలోచ‌న మానుకున్న‌ట్టు తెలిసింది.

మ‌రోవైపు కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతుండడంతో…రానా పెళ్లికి సంబంధించి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. మొద‌ట ఈ పెళ్లి వేడుక‌ను ఫ‌ల‌క్ నుమా ప్యాల‌స్ లో చేద్దామ‌నుకున్నారు. కాని కోవిడ్ తీవ్ర‌త నేప‌థ్యంలో పెళ్లి వేడుక‌ను మార్చిన‌ట్టు తేలిసింది. దాన్ని ఫ‌ల‌క్ నుమా ప్యాల‌స్ నుంచి రామానాయుడు స్టూడియోస్‌కి మార్చార‌ని స‌మాచారం. అంతేకాదు…రానా మిహికాల పెళ్లికి చాలా త‌క్కువ మంది పెళ్లికి హాజ‌రుకాబోతున్నార‌ని తెలిసింది.

ఇండ‌స్ట్రీ మొత్తాన్ని స్నేహితులు , బంధువుల‌ను క‌లిగి ఉన్నప్ప‌టికీ…కేవ‌లం చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి 30 మందికే ఆహ్వానం అంద‌నుంద‌ని స‌మాచారం. అయితే వారెవ‌రూ అనేది ప్ర‌స్తుతానికి అయితే తెలియ‌లేదు. ఇక ఈ వివాహ వేడుకకు హాజరవ్వనున్న ప్రతిఒక్కరూ…….. కరోనా టెస్ట్ చేయించుకోనున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు అయితే ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. త్వ‌ర‌లోనే పెళ్లి తేదీకి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని టాలీవుడ్ లో టాక్ .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad