Home టాప్ స్టోరీస్ ఆ రాముడికి పోటీగా ఈ రావణుడు సిద్ధం: “ఆదిపురుష్” క్రేజీ అప్ డేట్

ఆ రాముడికి పోటీగా ఈ రావణుడు సిద్ధం: “ఆదిపురుష్” క్రేజీ అప్ డేట్

1597990403

వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ మరోసారి తన అభిమానులకు క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రం “ఆదిపురుష్”కు సంబంధించిన కీలక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను దర్శకుడు ఓం రౌత్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రకటించాడు. తాజా ప్రకటన ప్రకారం ఈ చిత్రంలో  సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడుగా కనిపించనున్నారు. దర్శకుడు నిన్న సాయంత్రం ట్వీట్ చేస్తూ “7000 వేల సంవత్సరాల కితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షకుడు ఉద్భవించాడు” అని అన్నారు. దీని ప్రకారం ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

మొదట్లో చిత్రంలో ప్రతినాయక పాత్ర కోసం ఓ భారీ హీరోని తీసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో  జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఆ వాదనను ఓం రౌత్ ఖండించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఇతిహాస గాధతో రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటించనున్నారని బీ టౌన్ వర్గాలు అనుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మొదట రాధ శ్యామ్ సినిమాను పూర్తి చేసి తరువాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయనున్నారు.

ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతనే  “ఆదిపురుష్” సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సీత పాత్రలో నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై మూవీకి స్పందించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అప్డేట్స్ లేని ప్రభాస్ అభిమానులకు ఒకేసారి ఇన్ని అప్డేట్స్ రావడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad