Home సినిమా అతని కోసమే కలలు కన్నాను.. రాధికా ఆప్టే..!

అతని కోసమే కలలు కన్నాను.. రాధికా ఆప్టే..!

‘గ్రీక్ వీరుడు నా రాకుమారుడు..’ అంటూ జీవితంలో ఒక్కసారైనా అమ్మాయిలు కలల లోకంలో విహరిస్తుంటారు. ఒక సినీ నటి కూడా ఓ రాకుమారుడి కోసం పగటి కలే కాదు, రాత్రి కలలోకి రావాలని త్వరగా నిద్రపోయేదట. ఎవరా నటి అనుకుంటున్నారా? ఆమె గూర్చి మీ అందరికి ఎలాగో తెలుసు కానీ ఆమె ఎవరో చెప్పడం కన్నా ముందుగా ఆమె ఏ కల కోసం నిద్రపోయేది? మరి ఆ కల నెరవేరిందా? ఇప్పటికి కల కలలాగే ఉందా ? ఎవరా రాకుమారుడు? తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటె ఓ కార్యక్రమానికి  వెళ్దాం రండి..

‘నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఒక అబ్బాయిని ఎంతో ఇష్టపడ్డాను. ఆ అబ్బాయి కలలోకి రావాలని త్వరగా నిద్రలోకి జారుకునేదాన్ని. నేను అప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాను. ఏంటి అంత చిన్న వయస్సులోనే ఒక అబ్బాయి కోసం ఊహాలోకంలో విహరించిందా అనుకుంటున్నారా..? అలాంటి ఆలోచన నా మదిలో రావడానికి చాలా కారణాలున్నాయి. మా ఇంట్లో ఒక పని ఆవిడా ఉండేది. ఆమెకు  సినిమాలనంటే  పిచ్చి. ఛాన్స్ దొరికిందంటే చాలు టీవీ లో సినిమాలు తెగ చూస్తుండేది.. అంతే ఇక నేను కూడా ఆమెతో పాటు అలా టీవీ ముందరే అతుక్కుపోయేదాన్ని. ఆ రోజుల్లో వచ్చే పాటలో ఎక్కువగా వర్షం… గాలి రావడం ఆ సమయాన హీరోయిన్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటె, చీరకొంగు ఎగురుతుండేది. అలా ఊహాలోకంలోనున్న ఆమెతో కలిసి హీరో పాటలు పాడుతూ స్టెప్స్ వేసే సన్నివేశాలే ఎక్కువగా ఉండేవి. అంతే ఇక నేను మా క్లాస్ లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నన్ను నేను ఒక హీరోయిన్ లా ఊహించుకునేదాన్ని. నేను చీర కట్టుకొని వర్షంలో తడుస్తూ.. అతనితో డ్యూయెట్ చేస్తే బాగుండని ఆశపడేదాన్ని. కానీ అలాంటిది ఎప్పుడు జరగలేదు. నేననుకునేది కనీసం కలలోనైనా జరుగుతుందేమోనని అతనిని గుర్తు చేసుకొని మరీ త్వరగా నిద్రలోకి పోయేదానిని’. అంటూ తన మనసులోని మాటల్ని గలగలా చెప్పేసింది.

ఏంటి ఈ సందర్భం ఎందుకొచ్చిందా అనుకుంటున్నారా? ముంబై లోని మీథీబాయి కాలేజ్‌ కు సంబందించిన కొంతమంది విద్యార్థినిలు ‘ఓ మై హృతిక్‌’ (ఓఎంహెచ్‌) షో ని చేపట్టారు. హృతిక్ రోషన్ అమ్మాయిలందరికి కలల రాకుమారుడని ఈ పేరుతో ప్రారంభించారట. ఈ షో స్పెషల్ ఏంటంటే ఆడవాళ్ళంతా వారి జీవితంలో గల అనుభవాలను డేర్ గా చర్చించుకోవటమన్నమాట.

ఈ సందర్బంగా ఓఎంహెచ్‌ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ సినీ నటి రాధికాఆప్టే మీడియా ద్వారా చిన్ననాటి కలను పంచుకున్నారు. ఆడవాళ్లు ఎప్పుడు తాము కంటున్న కలల గురించి ఏ విధమైన సంకోచం లేకుండా బయటికి చెప్పుకోవడం వలన వారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఎదుగుతారు. ప్రస్తుత వారి పరిస్థితి ఏంటి అనేది వారికే ఒక అవగాహనా వస్తుందంటూ ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన మహిళలు మానసిక పరమైన ఆందోళలకు దూరమవుతారని తన అభిప్రాయాన్ని చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad