
యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను ఎసరుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే తారక్ తన కెరీర్లో ఓ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని కేవలం తన ఇమేజ్ కారణంగా మిస్ చేసుకున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మాస్ చిత్రాలతో వరుసగా దూసుకుపోతున్న తారక్‌కు ఆ సమయంలో ‘బొమ్మరిల్లు’ లాంటి క్లాస్ సబ్జెక్ట్ వచ్చిందని ఆయన ఓ సందర్భంలో తెలిపాడు. అయితే ఆ సినిమాలో మాస్ అంశాలు లేకపోవడం తారక్‌కు నచ్చలేదట. మాస్ డ్యాన్సులు, ఫైట్లు ఆ సినిమాలో లేవని దర్శకుడు భాస్కర్ చెప్పడంతో తన మాస్ ఇమేజ్‌కు ఆ సినిమా సెట్ కాదని తారక్ ఆ సినిమాను చేయడానికి ఒప్పుకోలేదట.
కాగా ఆ తరువాత బొమ్మరిల్లు సినిమా యంగ్ హీరో సిద్ధార్థ్ చెంతకు చేరిందట. ఆయన ఆ సినిమాను చేయడం, దానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అప్పట్లో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇలా ఓ క్లాసిక్ మూవీని కేవలం తన ఇమేజ్ కారణంగా వదులుకుని ఓ భారీ బ్లాక్‌బస్టర్‌ను వదులుకున్నానని తారక్ పలుమార్లు బాధపడ్డాడట. ఇక తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో నటిస్తూనే, తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.