సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు చాలావరకు వివాదాస్పద సినిమాలను తీశాడు. అయితే తాను తీసిన సినిమాలు అన్ని ఒకలాగా ఉంటే వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మాత్రం మరో ఎత్తు. ఎన్టీఆర్ జీతంలోకి లక్ష్మి పార్వతి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన లను ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నాడు. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీయటం వెనుక అసలు నిజాన్ని బయట పెట్టాడు తాను అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఎందుకు తిసానో ప్రజలకు చెప్పాలిసింది గా తనను ఎన్టీఆర్ కోరారని వర్మ తెలిపాడు. వర్మ తన వాయిస్ మెసేజ్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేసాడు.
ఎన్టీఆర్ 1989 అసెంబ్లీ ఎన్నికలో దారుణంగా ఓవీడిపోయి అధికారం కోల్పోయిన సమయం నుండి జరిగిన సంఘటనలు వర్మ ఈ వీడియో లో ప్రస్తావించారు. గత పాతికేళ్లుగా నిజాలుగా చెలామణి అవుతున్నా సిగ్గు లేని అబద్దాలను శాశ్వతంగా నిజం అనబడే గోతి లో పాతి పెట్టడం ఈ సినిమా ఉదేశ్యం అని వర్మ వివరించారు. తాజాగా విడుదల చేసిన వర్మ వాయిస్ కూడా సంచలనం కలిగిస్తుంది. అటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను వర్మ బాగా ప్రమోట్ చేస్తున్నాడు.
రాహుల్ గాంధీ, జగన్, కేటీర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూస్తునట్టుగా సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. వర్మ మరో వైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ కు యూట్యూబ్ లో భారీ వ్యూస్ క్కూడా వస్తున్నాయి రిలీజ్ చేసిన ఒక గంటకే 5. 5లక్షల వ్యూస్ వచ్చాయి 24 గంటలోనే 4మిలియన్ల వ్యూస్ వచ్చాయని అందరికి థాంక్స్ వర్మ అని చెప్పాడు.