Home సినిమా ఎన్టీఆర్ బయోపిక్ స‌రికొత్త రికార్డ్..!

ఎన్టీఆర్ బయోపిక్ స‌రికొత్త రికార్డ్..!

ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల కానున్న ఎన్టీఆర్ బయోపిక్ మొత్తం రెండు భాగాల‌ను క‌లిపి బడ్జెట్‌ను ముందుగానే లాగేసింది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ ఇతర ఆదాయాల పరంగా ఏకంగా 60కోట్ల రూపాయలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. ఇక థియేటర్ల రెవెన్యూ అదనం. డిజిటల్, శాటిలైట్ అమ్మకాలను అన్ని భాషలకు కలిపి రూ.60 కోట్ల రూపాయలకు అమ్మారు. బాహుబలి సినిమా తర్వాత ఇదే అత్యధికం ఇది ఒక రికార్డ్.

అయితే, ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్‌ని పూర్తిగా రెండు భాగాలుగా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి బాలక్రిష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఈ నెల 9న విడుదల కానుంది. రెండవ భాగం వచ్చే నెల ఫిబ్ర‌వ‌రి 7న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళ భాషలోనూ విడుదల కానుంది. ఈ రెండు భాగాల డిజిటల్, శాటిలైట్ హిందీ డబ్బింగ్ రైట్ ను కలిపి రూ.60కోట్ల‌కు అమ్ముడుపోయాయి.

అంతేకాకుండా, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల బడ్జెట్ దాదాపు రూ.80కోట్లు, అంటే రెండు భాగాలు సంబంధిచిన ఇన్వెస్ట్‌మెంట్ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌తోనే మినిమమ్‌ ఆదాయం వచ్చింద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా ఒక రోజు ముందే జనవరి 8 ప్రీమియర్ కానుంది.

విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బాలయ్య విద్యాబాలన్ మీద ఎక్కువ సీన్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇక బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ 2019 తెలుగు సినిమా వ్యాపారానికి కొత్త జోష్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని ఎంత భారీ మొత్తానికి అమ్మొచ్చో అన్న విష‌యంలో ఇతర నిర్మాతలకు దారి చూపిందంటూ సోష‌ల్ మీడియాలో సినీ జ‌నాలు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad