Home సినిమా గాసిప్స్ పవన్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ తప్పదా?

పవన్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ తప్పదా?

No Gift On Pawan Kalyan Birthday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్‌కు చూపెట్టాలని చూస్తున్నాడు. కాగా బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఓ లిరికల్ సాంగ్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించి ఏదైనా గిఫ్ట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ పుట్టినరోజున ఎలాంటి పోస్టర్, టీజర్‌లను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం లేదట.

ఇది ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా నిరాశ కలిగించే వార్త అని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ పవన్ రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా నుండి గిఫ్ట్ వస్తుందని వారు ఆశించారు. ఇక ఇటీవల పవన్ కళ్యాన్ పుట్టినరోజు కానుకగా ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు వరల్డ్ రికర్డు ట్వీట్లను ట్రెండ్ చేశారు ఆయన అభిమానులు. కానీ వారికి మాత్రం పవన్ పుట్టినరోజున ఎలాంటి బహుమతి ఇచ్చేందుకు పవన్ రెడీగా లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరి వారికి ఊరటనిచ్చే బహుమతి ఏదైనా పవన్ రెడీ చేస్తున్నాడో లేదో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad