Home సినిమా ఇగో లేని మ‌నిషి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

ఇగో లేని మ‌నిషి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

pawan kalyan

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన  మొద‌టి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. 2018 అక్టోబ‌ర్ లో రిలీజైన ఈ  సినిమా మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. దాదాపు 150 కోట్లు వ‌సూలు చేసింది. ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ యాక్టింగ్…త్రివిక్ర‌మ్ టేకింగ్, జ‌గ‌ప‌తిబాబు టెర్రిఫిక్ ప్ర‌జంటేష‌న్‌…థ‌మన్ మ్యూజిక్ అన్నీ క‌లిపి సినిమాను పెద్ద హిట్‌గా నిలిపాయి. నిజానికి ఈ సినిమా  రిలీజుకు ముందే కాదు రిలీజ్ త‌ర్వాత కూడా అంత పాజిటివ్ వైబ్స్ లేవు. ఆ సినిమాలో న‌టించిన కొంద‌రు స‌భ్యులే…ఈ సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని భావించారు. కానీ  అంద‌రి అంచ‌నాల‌ను తారు మారు చేస్తూ….. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఎన్ టీ ఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్  ఫైట్ ను….. క్లైమాక్స్ ఫైట్‌లో చిత్రీక‌రించారు.

సినిమా మొద‌ట‌లోనే ఎన్టీఆర్ యాక్ష‌న్ ….థియేట‌ర్‌లోని ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేలా చేసింది.  ఈ ఫైట్ లో ఎన్ టీ ఆర్ ఎలివేష‌న్‌కి వీక్ష‌కులు  మెస్మ‌రైజ్ అయ్యారు. ఈ రేంజ్ లో ఎన్ టీ ఆర్ ఎలివేష‌న్ ఉంటుంద‌ని….. ఏ ఒక్క‌రూ ఊహించ‌లేదు. అంత‌ట భారీ యాక్ష‌న్ సీన్‌ని ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడు త్రివిక్ర‌మ్‌.ఇక థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, సాంగ్స్ సినిమాకి పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. ఎన్టీఆర్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డేలా చేసిన ఈ సినిమా వెనుక చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్‌కోసం కాదు రాసుకున్న‌ది కాద‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం త్రివిక్ర‌మ్ రాశార‌ట‌. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అజ్ఞాత వాసి అట్ట‌ర్ ప్లాప్ గా నిలిచింది. ప‌వ‌న్ కెరీర్‌లోనే డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది.

అజ్ఞాత‌వాసి ఫ్లాప్ ఫ్యాన్స్‌ తో పాటు చిత్ర బృందం మొత్తాన్ని  తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. అందుకే ఎలాగైనా మ‌ళ్లీ ప‌వ‌ర్ స్టార్ కి ఒక భారీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ఇవ్వాల‌న్న క‌సితో ……అర‌వింద స‌మేత క‌థ రాసి ప‌వన్ క‌ల్యాణ్‌కి వినిపించార‌ట‌. కానీ ఈ క‌థ విన్న ప‌వ‌న్  చాలా బాగుంది అన్నాడు. కానీ ఈ స్టోరీ నా కంటే కూడా ఎన్టీఆర్‌కి చాలా బావుంటుందని స‌ల‌హా ఇచ్చాడు.  సినిమా సూప‌ర్ హిట్ట‌వుతుందని గ‌ట్టిగా చెప్పాడు.  ఏ మాత్రం  ఆలోచించ‌కుండా ఈ క‌థ ఎన్ టీ ఆర్ కి న‌చ్చితే….. చేసేయ్ అని చెప్పారట‌. మ‌నం ఇంకో సినిమా చేద్దాంలే అని చెప్పి…త్రివిక్ర‌మ్‌కు న‌చ్చ‌జెప్పాడు. అదే క‌థ‌తో ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం…అది న‌చ్చ‌డం..సినిమా చేసేయ‌డం జ‌రిగిపోయింది. దాని ఫ‌లిత‌మేంటో తెలుగుప్రేక్ష‌కులంతా చూశారు. అలా  ఈ సూప‌ర్ హిట్ సినిమా….. ఎన్ టీ ఆర్ ఖాతాలో ప‌డింది. అందుకు కార‌ణం అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ….ఎన్ టీ ఆర్ కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపాడు.

ఈ ఒక్క విష‌యం చాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వం తెలియ‌డానికి,  ఇగో లేని మ‌నిషి అని ఒప్పుకోవ‌డానికి.  ప‌వ‌న్ ఈ క్యారెక్ట‌ర్ చూసి చాలా మంది అభిమానులుగా మారిపోయారు. నిజానికి ఆ క‌థ‌ను మెగా హీరోల్లో ఎవ‌రికైనా సెట్ చేయొచ్చు…కానీ ప‌వ‌న్ అలా చేయ‌లేదు. ఎవ‌రికైతే బాగా సెట్ అవుతుందో వారి పేరే త్రివిక్ర‌మ్‌కు చెప్పి సినిమా ప‌ట్టాలెక్కేలా చేశాడు ప‌వ‌న్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad